tdp leader nara lokesh supported to venkayamma
mictv telugu

వెంకాయమ్మకి ఏమైనా అయితే తీవ్ర పరిణామాలు : లోకేష్

May 17, 2022

tdp leader nara lokesh supported to venkayamma

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేసిన దళిత మహిళ వెంకాయమ్మకు లోకేష్ మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

‘జగన్ పాలనలో ప్రజల పరిస్థితి గురించి చెప్తూ ఐదు కోట్ల ఆంధ్రుల అభిప్రాయాలను చెప్పిన వెంకాయమ్మకు సమాధానం చెప్పే దమ్ముందా? వైసీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటికి వెళ్లి బెదిరిస్తారా? ఆమెకు గానీ, ఆమె కుటుంబసభ్యులకు గానీ ఎలాంటి హాని జరిగినా తీవ్ర పరిణామాలు తప్పవు. మీ దగ్గర ఉన్నవి కిరాయి మూకలు.. మా దగ్గర పార్టీ కోసం ప్రాణమిచ్చే లక్షలాది మంది సైనికులు ఉన్నారు. నిరక్షరాస్య, నిరుపేద, దళిత మహిళ వెంకాయమ్మ చెప్పిన మాటే రాష్ట్రంలో ప్రతీ ఇంటా, ప్రతీ నోటా వినిపిస్తోంది. జగన్ రెడ్డి గారూ.. ఈ ఐదు కోట్ల మందిపై దాడి చేయిస్తారా? అని ప్రశ్నించారు.