TDP leader Vangalapudi Anitha Comments On Plastic Flexis Ban
mictv telugu

ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం పవన్ పుట్టినరోజు వరకే ఉంటుందా?

August 28, 2022

ఇటీవల విశాఖ పర్యటనలో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. విశాఖ నుంచే ఈ నిషేధం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. అయితే ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధం కూడా సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలానే అవుతుందా? అంటూ ట్వీట్ చేశారు

గతంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదలయ్యే వరకు తగ్గిన సినిమా టిక్కెట్లు.. ఆ తర్వాత పెరిగినట్లు.. ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వరకే వర్తిస్తుందా అని వంగలపూడి అనిత అనుమానం వ్యక్తం చేశారు. పరిస్థితులు చూస్తుంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2 వరకే ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం ఉంటుందేమోనని సందేహం వస్తోందన్నారు. కాగా, జనసేనాని పవన్ కల్యాణ్ సెప్టెంబరు 2న పుట్టినరోజు జరుపుకోనున్నారు.