రేవంత్ కు గట్టి ఎదురుదెబ్బ - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్ కు గట్టి ఎదురుదెబ్బ

October 24, 2017

తెలంగాణ టీడీపీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్, దౌల్తాబాద్ మండలాలకు చెందిన వందలాది టీడీపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, కొంతమంది కార్యకర్తలు కలిపి మొత్తం 700 మంది తెలంగాణ భవన్‌లో డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ , రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి  సమక్షంలో  గులాబీ కండువాలు కప్పుకున్నారు.

వీరిలో శరణమ్మ, హనుమంతురెడ్డి కొడంగల్ ZPTC, ప్రవీణ్ కుమార్ గౌడ చిట్ల పల్లి MPTC, మహిపాల్ రెడ్డి దౌల్తాబాద్ టి.డి.పి మండల పార్టీ అధ్యక్షుడు, పార్వతమ్మ  టిడీపీ సర్పంచ్ దౌల్తాబాద్, మధుసూదన్ రెడ్డి టి.డి.పి సర్పంచ్ గుండెపల్లి,  మాధవి టీడీపీ సర్పంచ్  చంద్రకల్,  ఆశన్న ఉప సర్పంచ్ చంద్రకల్, జాకీర్ దౌల్తాబాద్ మండలం, చిన్నారెడ్డి మాజీ MPTC చెన్నారం కోస్గి మండలం,  కళావతి  టిడిపి సర్పంచ్ బిజ్జరాం,  వడ్ల వెంకటయ్య  మాజీ సర్పంచ్ బిజ్జరాం, పటేల్ బస్వరాజు టీడీపీ విలేజ్ ప్రెసిడెంట్  బిజ్జరాం,  బసంత్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ అంతారం దౌల్తాబాద్ మండలం,  రాజప్ప PACS డైరెక్టర్ దౌల్తాబాద్, ఆనంతయ్య మాజీ MPTC గోకపస్లాబాద్..దౌల్తాబాద్ మండలం తదితరులు ఉన్నారు. రేవంత్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరు కేసీఆర్ పార్టీలోకి ఫిరాయించడం గమనార్హం.