రేవంత్, కవిత కలసి కంపెనీ రిజిస్ట్రేషన్ - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్, కవిత కలసి కంపెనీ రిజిస్ట్రేషన్

October 23, 2017

రేపోమాపో కాంగ్రెస్‌లో చేరతారని భావిస్తున్న తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి పయ్యావులు కేశవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్‌కు వ్యక్తిగత అజెండాలే ప్రధానమని, తనకు పార్టీ ప్రయోజనాలు ముఖ్యమని అన్నారు. రేవంత్ జైలుకు వెళ్తే మొదట తానే స్పందించానన్నారు. ‘రేవంత్ పార్టీలో తనకు ప్రాధాన్యం లేదని అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబుకు ఆయనకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. రేవంత్ స్వార్థపరుడు. అతడు కేసీఆర్‌ కుమార్తె, కవితతో కలిసి కంపెనీ రిజిస్టర్‌ చేశాడు… జగన్‌తోనూ  రేవంత్‌ కు సంబంధాలు ఉన్నాయి. మా నేత చంద్రబాబుతో మాట్లాడి అతని బండారమంతా బయటపెడతాను’ అని కేశవ్ సోమవారం అమరావతిలో విలేకర్లతో అన్నారు.

చంద్రబాబు ప్రోత్సాహం వల్లే రేవంత్‌ ఈ స్థాయికి చేరుకుని, ఇప్పడు దిగజారి మాట్లాడుతున్నారని కేశవ్ మండిపడ్డారు. తనకు, ఏపీ మత్రి సునీతకు ఎలాంటి లావాదేవీలూ లేవని స్పష్టం చేశారు. కేవలం మర్యాదపూర్వకంగానే కేసీఆర్ ను కలసిశానని, కేసీఆర్ వల్ల తానెలాంటి ప్రయోజనమూ పొందలేదన్నారు. హైదరాబాద్ లో తన ఆస్తులే లేవని చెప్పుకొచ్చారు.

గన్‌తోనూ రేవంత్‌కు సంబంధాలు.. తనకు, మంత్రి పరిటాల కుటుంబానికి తెలంగాణలో ఎలాంటి వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఒక్క ప్లాటు కూడా లేదని పేర్కొన్నారు. లేని నా వ్యాపారాలపై మాట్లాడే ముందు రేవంత్‌ తన వ్యాపారాల గురించి మాట్లాడాల‌ని డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితోనూ రేవంత్ రెడ్డికి సంబంధాలున్నాయని కేశవ్ ఆరోపించారు.జగన్‌తో అంటకాగిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.