స్పీకర్‌‌పై పేపర్లు చించేసిన టీడీపీ సభ్యులు - MicTv.in - Telugu News
mictv telugu

స్పీకర్‌‌పై పేపర్లు చించేసిన టీడీపీ సభ్యులు

March 14, 2022

05

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ స‌మావేశాలు ఈనెల 25 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల ప్రారంభం నుండి టీడీపీ సభ్యులు పలు నినాదాలు చేస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా గవర్నర్ ప్రసంగ ప్రతులను చించేశారు. ఈ క్రమంలో సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీసారా మూలంగా 18 మరణించిన విషయాన్ని ప్రస్తవిస్తూ.. వెంటనే జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా సభను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఏకంగా స్పీకర్ వెల్‌లోకి దూసుకొచ్చారు. అనంతరం పేపర్లను చించేసి స్పీకర్‌ (తమ్మినేని సీతారామ్) పై విసిరారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీలో కలకలం రేగింది. స్పీకర్ ఎంత నచ్చచెప్పినా టీడీపీ సభ్యులు వినిపించుకోకపోవడంతో తమ్మినేని సీతారామ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, సీఎం రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆ ఘటనపై తమ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని జగన్ వెల్లడించారు.