అచ్చెన్నాయుడు పిటిషన్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు - MicTv.in - Telugu News
mictv telugu

అచ్చెన్నాయుడు పిటిషన్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

July 8, 2020

TDP MLA Atchannaidu Petition

ఈఎస్ఐ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయన్ను వెంటనే ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాలని ఆదేశించింది. పభుత్వం తరుపు న్యాయవాది వాదనలను తోసి పుచ్చుతూ.. ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అతన్ని గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

కేసు విచారణలో ఉన్న అచ్చెన్నాయుడును ఇటీవల జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత జైలుకు తరలించారు. అయితే తన ఆరోగ్యం ఇంకా కుదట పడలేదని ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అనుమతి ఇచ్చింది.దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను ఏ ఆస్పత్రికి తరలించాలన్నది.. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిర్థారించాలని వాధించారు. అతని వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లేలా ఉత్తర్వులు ఇచ్చారు.