టీడీపీ ఎమ్మెల్సీ ఫరూఖ్ శుక్రవారం కొత్త పాయింట్ లేవదీశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘చంద్రబాబు, బాలకృష్ణలకు వారసులు ఉన్నారు. మరి జగన్‌కు ఎవరున్నారు? ఆయనకు వారసులు లేరు. టీడీపీకి 65 లక్షల కార్యకర్తలు, ఎన్టీఆర్, బాలయ్య అభిమానులున్నారు. చంద్రబాబుకు వయసైపోయిందని మాట్లాడే ముందు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచించి మాట్లాడాల’ని హితవు పలికారు. కాగా, సీఎం జగన్‌కు కుమారులు లేరు. ఇద్దరు కుమార్తెలే. ఒకవేళ జగన్ సోదరి షర్మిల కుమారుడు వారసత్వం అనుకున్నా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఇది సాధ్యపడదు. మరి జగన్ తర్వాత వైసీపీకి వారసుడు ఎవరో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.