మేకప్‌పై ఉన్న శ్రద్ధ టూరిజంపై లేదా రోజా? మంతెన - MicTv.in - Telugu News
mictv telugu

మేకప్‌పై ఉన్న శ్రద్ధ టూరిజంపై లేదా రోజా? మంతెన

May 6, 2022

ఏపీ మంత్రి ఆర్కే రోజాపై, ఆమె భర్త సెల్వమణిపై తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక వైపు రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి రోజా చెబుతుంటే.. ఆమె భర్త సెల్వమణి మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని సత్యనారాయణరాజు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో తమిళ సినిమా హీరోల సినిమా షూటింగులు వద్దని చెప్పిన సెల్వమణి వ్యాఖ్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు.

మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా తన భర్తను లెక్క చేయడం లేదేమోనని, అందుకే సెల్వమణి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారమోనని సైటెర్లు వేశారు. ఇంట్లో పరిస్థితులే చక్కదిద్దుకోలేని మంత్రి రోజా.. ఇక రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. మంత్రి రోజా తన మేకప్ మీద పెట్టిన శ్రద్ధలో కనీసం ఒక్క శాతం అయినా పర్యాటక శాఖపై పెట్టాలని సూచించారు. తన భర్త చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.