సన్నీ లియోన్, చంద్రబాబు, నంద్యాల.. - MicTv.in - Telugu News
mictv telugu

సన్నీ లియోన్, చంద్రబాబు, నంద్యాల..

August 19, 2017

వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకున్నాడని అంటారు. ఈ రెండు ఫొటోలను చూశాక చంద్రబాబు అంతటి వాడు సన్నీలియోన్  ఫొటోలనూ పట్టుకున్నాడని మీరు కూడా ఒప్పేసుకుంటారు.. ! టీడీపీ తమ్ముళ్లు కాపీయింగ్ లోనూ చేతగాని వాళ్లని నవ్వుకుంటారు..

బాబు అనుంగు తమ్ముళ్లు చేసిన నిర్వాకం ఈపాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. మొదటి ఫొటో గురువారం అడల్ట్ మూవీ స్టారిణి సన్నీ కొచ్చి పర్యటనకు వచ్చినప్పటి ఫొటో. ఆమెను చూడ్డానికి జనం తండోపతండాలు ఎగబడి వచ్చారు. వీధులు జనంతో కిక్కిరిసిపోయి ట్రాఫిక్ స్తంభించి పోయింది. సన్నీ కూడా ఆ అభిమాన కెరటాల తాకిడికి బిత్తరపోయింది. తర్వాత ఆమే స్వయంగా ఈ ఫొటోలను వీడియోలను షేర్ చేసింది.

నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనుకున్న టీడీపీ తమ్ముళ్ల బుర్రలో సన్నీ ఫొటోలు చూశాక వెర్రి ఆలోచన వచ్చింది. ఇంకేం సన్నీ పోస్ట్ చేసిన జనం ఫోటోను కాపీ కొట్టేసి రెండో ఫోటోలా మార్చిపారేశారు. నంద్యాలలో జరిగిన సన్నీలియోన్ రోడ్ షోకు.. సారీ చంద్రబాబు రోడ్ షోకు జనం తండోపతండాలుగా వచ్చారని..  ఈ ఫొటోతో ఊకదంపుడు ప్రచారం చేస్తున్నారు..

మొత్తానికి తెలుగు తమ్ముళ్ల నిర్వాక ఫొటోను సన్నీలియోన్  చూసుంటే కిసుక్కున పుసుక్కున్న నవ్వుకుని చచ్చేది. తన స్టార్ డమ్ ను రాజకీయ నేతలు ఇలా కూడా పరమ భావదరిద్రంగా క్యాష్ చేసుకుంటున్నారు కనుక  అందులో తనకూ వాటా కావాలని డిమాండ్ చేసేదేమో..!