కేంద్ర మంత్రి గడ్కరీతో టీడీపీ ఎంపీ కేశినేని నాని భేటీ   - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్ర మంత్రి గడ్కరీతో టీడీపీ ఎంపీ కేశినేని నాని భేటీ  

August 15, 2020

TDP MP Kesineni Nani Meets Nitin Gadkari

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని శనివారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఓ లేఖను కూడా అందజేశారు. ఈ విషయాన్ని నాని స్వయంగా తన ట్వీట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కనకదుర్గ ప్లై ఓవర్ ప్రారంభోత్సవానికి రావాలని తన తరుపున ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో గడ్కరీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ పనులు పూర్తి చేసినందున ప్రారంభోత్సవానికి కూడా రావాలన్నారు. నగరానికి కనకదుర్గ ఫ్లైఓవర్ అందమైన మణిహారం వంటిదని అభివర్ణించారు. కాగా అన్ని పనులు పూర్తి కావడంతో దీన్ని ప్రారంభించేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే చిన్న చిన్న పనులు చేసి వైసీపీ ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని నాని ఆరోపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తన వల్లే పనులు వేగంగా జరిగాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నాని కేంద్ర మంత్రిని కలవడం ఆసక్తిగా మారింది.