తప్పు మీద తప్పు… పాపం తెలుగు దేశం... - MicTv.in - Telugu News
mictv telugu

తప్పు మీద తప్పు… పాపం తెలుగు దేశం…

July 22, 2017

తెలుగుదేశాన్ని పట్టి పీడిస్తున్న మిస్టేక్స్ గొడవ ఇప్పట్లో పోయేట్లు లేదు. ఒకరి తర్వాత ఒకరు  ఏదో  తప్పు చేస్తూనే ఉన్నారు. తప్పు మీద తప్పు.. ఆ తప్పు మర్చిపోయే లోపే మరో తప్పు చేస్తున్నారు. జనాల్లో నవ్వుల  పాలవుతున్నారు. లోకేష్ బాబు, జలీల్ ఖాన్ చాలదన్నట్లు తాజాగా అచ్చాన్నాయుడు గారు వీళ్లుకు యాడ్ అయ్యారు. ఎర్రంనాయుడి కుమారుని వివాహా రిసెప్షన్ కార్యక్రమాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు అక్కడి ప్రముఖుల కోసం. దీనికి మోదీతో సహా ప్రముఖులు చాలా మందే వచ్చారు. అందరి గురించి రాస్తూ అచ్చెంన్నాయుడు గారు తన ఫేస్ బుక్ అకౌంట్లో స్పీకర్ షీలాదీక్షిత్ గారూ వచ్చారని రాశారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఈ విషయం కూడా  మంత్రిగారికి తెలియదా అని నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారట.

ఇంతకు ముందు బికాంలో ఫిజక్స్ చేశానంటూ  వివాదాన్ని ఫిక్స్ చేసుకున్న జలీల్ ఖాన్…. ఏదో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వేరేవాళ్లను చేయి ఎత్తి ప్రమాణం చేయమంటే ఖాన్ గారే చేయి పైకెత్తారు. అంతా ఘోళ్లమన్నారు. పక్కనే ఉన్న నాయకుడొకరు ఖాన్ చేయి దించారు. ఎమరు పాటుగానో… యాదృచ్చికంగానే ఏదో విధంగా మిస్టేక్స్ చేయడానికి ఖాన్ గారు బాగా కమిట్ అయ్యారని జోకులు పేలుతున్నాయట.

ఆ మధ్య లోకేష్ బాబు పేల్చిన డైలాగులు  గుర్తుకొచ్చినప్పుడల్లా జనాలు పడి పడి నవ్వుతూనే ఉన్నారట. వేసవిలో  జనాలకు తాగు నీటి సమస్య కల్పిస్తానని చెప్పారు. అంబేద్కర్ జయంతిని, వర్థంతి అని, వర్ధంతిని జయంతిని  చెప్పారు. అంతే కాదు ప్రధాన మంత్రిగా పి.విని చేసింది తామేనని టిడిపి నాయకులెవరు అన్నారట. ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు  కొడుతున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో పనిచేస్తున్న నాయకులు ఇట్లా ఎందుకు చేస్తారో మరి.

గేమ్స్ ల్లో మంచి ప్రతిభ చూపించిన వారికి  నోబెల్ బహుమతులు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు సెలవిచ్చారు. ఆటలకు.. అదీ ఎపి   సిఎం నోబెల్ బహుమతి ఎట్లా ఇస్తారో మరి. ఈ విషయం గురించి కూడా జోకులు బాగానే పేలాయి.  నోబెల్ కు రెకమండ్ చేస్తాననో…. నోబెల్ స్థాయి బహుమతి ఇస్తామనో బాబుగారి ఉద్దేశ్యం  అయి ఉంటుంది కావొచ్చు. కాక పోతే జనాలకు మాత్రం బాబు గారి అంతరంగం కంటే…. ఇదే కన్వే అయినట్లుంది.

అయితే అచ్చెంన్నాయుడు గారి విషయాని కొద్దాం….. ఫేస్ బుక్ అకౌంట్ ఆయనదేనో లేక పోతే  ఆయన అభిమానులే  పోస్టు పెట్టారో తెలియదు కానీ….  మంత్రిగారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టినట్లైంది.