ఇసుక తట్టలు నెత్తిన పెట్టుకొని టీడీపీ నిరసన  - MicTv.in - Telugu News
mictv telugu

ఇసుక తట్టలు నెత్తిన పెట్టుకొని టీడీపీ నిరసన 

October 26, 2019

tdp...

ఇసుక కొరతపై ఏపీలో విపక్షాలు ప్రభుత్వం తీరును ఎండగడుతూనే ఉన్నాయి. దీంట్లో భాగంగా టీడీపీ వినూత్న పద్దతిలో నిరసన తెలుపుతోంది. భవన నిర్మాణా కార్మికులతో కలిసి తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట శనివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇసుక తట్టలు నెత్తి పెట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఇసుక దొంగలు పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించిన కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకు వైసీపీ చూస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని విమర్శించారు. వెంటనే ఇసుక సరఫరా చేసి కార్మికులకు ఉపాధి కలిగేలా చూడాలన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే నిరసన తీవ్రతరం చేస్తామన్నారు. కాగా గత సెప్టెంబర్ నెలలో కొత్త ఇసుక పాలసీని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.