ఏపీ రాజకీయాల్లో వైఎస్ వివేకా హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. ఏపీ నుంచి తెలంగాణకు కేసు బదిలీ అయ్యాక సీబీఐ స్పీడ్ పెంచడం హాట్ టాపికైంది. విచారణ వేగవంతం చేసిన అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు, సీఎం జగన్, వైఎస్ భారతికి సంబంధించిన మనుషులను విచారించడంతో రాజికీయంగా ఉత్కంఠ రేపుతోంది. ఇదే అంశాన్ని టీడీపీ అస్త్రంగా మలుచుకునే పడింది. తాజాగా వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్య నేపథ్యంలో ‘జగనాసుర రక్తచరిత్ర’ పుస్తకాన్ని టీడీపీ నేతలు విడుదుల చేశారు. పార్టీ ఇతర నేతలతో కలిసి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ పుస్తకాన్ని మీడియా ముందు రిలీజ్ చేశారు.
వివేకానందరెడ్డిని ఎవరు చంపారు.. అనే నిజాన్ని ప్రజలకు తెలిపేందుకు ‘జగనాసుర రక్తచరిత్ర’ పుస్తకాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ పుస్తకాన్ని అందించనున్నట్లు వివరించారు. గతంలో హత్య చంద్రబాబే చేయించారంటూ… ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ ప్రచారం చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అసలు నిందితులను ఇప్పుడు సీబీఐ తేలుస్తోందని చెప్పారు. జగన్ ఇంట్లో మనుషులను అధికారులు విచారించినా సీఎం స్పందించడం లేదని ధ్వజమెత్తారు.