మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం  - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం 

November 30, 2019

Atchannaidu .

టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కారు ప్రమాదానికి గురైది. ఈ ఘటనలో ఆయనకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. విశాఖపట్టణం జిల్లా నక్కపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఓ బైక్‌ను తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది. దీంతో ఆయనకు స్వల్పగాయాలు అయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. 

గుంటూరు నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో గన్‌‌మెన్ సహా మరికొందరికి కూడా గాయాలయ్యాయి. కారు ముందు భాగం స్వల్పంగా ధ్వంసమైంది. ఈ విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు కలవరానికి గురయ్యారు. అయితే స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ఆరోగ్యంపై పార్టీ నేతలు ఆరాతీశారు.