టీడీపీకి దివ్యవాణి రాజీనామా.. తర్వాత.. - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీకి దివ్యవాణి రాజీనామా.. తర్వాత..

May 31, 2022

టీడీపీ మహానాడులో తనకు అవమానం జరిగిందని , అందుకే రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేసిన ఆ పార్టీ అధికార ప్రతినిధి నటి దివ్యవాణి వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్‌లో చేసిన ట్వీట్‌ను ఆమె తాజాగా డిలీట్ చేశారు. మరో ట్వీట్ లో పార్టీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం గమనార్హం.

మహానాడులో తనకు ఘోర అవమానం జరిగిందని రెండ్రోజుల క్రితం ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు. టీడీపీకి నిస్వార్థంగా సేవ చేస్తున్న తనకు గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ఒక క‌ళాకారుడు (NTR) పెట్టిన పార్టీలో నాలాంటి క‌ళాకారుల‌కు స్థానం లేక‌పోవ‌డం న‌న్ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేస్తోందని, పార్టీలో ఎలాంటి గైడెన్స్ లేదని చెప్పారు. ఇన్ని రోజులు నేను అధికారం లేని అధికార ప్రతినిధిగా టీడీపీలో ఉన్నానన్నారు. అదే ఇంటర్వ్యూలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కానీ.. మాజీ మంత్రి కొడాలి నానితో కానీ తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు.