Tdp Victory In Graduate Mlc Elections
mictv telugu

Mlc Election Result : సైకిల్ హవా.. పశ్చిమ రాయలసీమ టీడీపీదే..

March 18, 2023

Tdp Victory In Graduate Mlc Elections

ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ రెక్కలు విరిగాయి. టీడీపీ గాలి వీచింది. 3 స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది . ఇప్పటికే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ..పశ్చిమ రాయలసీమలో కూడా టీడీపీకే విజయం వరించింది. రెండవ ప్రాధాన్యత ఓట్లతో 5 వేలకు పైగా మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి విజయం సాధించినట్లు సమాచారం. ఫలితాన్ని రిటర్నింగ్ అధికారి వెల్లడించాల్సి ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో క్లీన్ స్వీప్ చేయడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

అయితే ఓట్ల లెక్కింపు తీరుపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయాని వైసీపీ అభ్యర్థి రవీంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ కౌంటింగ్ కేంద్రంలో నిరసనకు దిగారు. అభ్యంతరాలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని వైసీపీకి అధికారులు సూచించడంతో ఆందోళనను విరమించారు.

చంద్రబాబు ట్వీట్

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించడంపై చంద్రబాబు ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ” పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్ధులకు అభినందనలు. గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్. ఇది ప్రజా విజయం. మార్పుకు సంకేతం. మంచికి మార్గం. రాష్ట్రానికి శుభసూచకం” అని ట్విట్టర్ వేదికగా తెలిపారు.