30 ఏళ్ల తర్వాత గెలిచింది...  - MicTv.in - Telugu News
mictv telugu

30 ఏళ్ల తర్వాత గెలిచింది… 

September 1, 2017

మొన్నటి దాకా అందరి దృష్టి నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల మీదనే ఉండె. అందులో టీడీపీ ఘన విజయం సాధించడం తెలిసిందే. అది ముగిసిందో లేదో ఇంకోటి మొదలైంది. అదే కాకినాడ మున్సిపల్ ఎలక్షన్స్ . వీటి ఫలితాలు శుక్రవారం వెలువడ్డయి.

మొత్తం 48 డివిజన్లకు గానూ బాబు పార్టీ 32 డివిజన్లలో, అక్కడ తొలిసారి బరిలోకి దిగిన  వైసీపీ 10 డివిజన్లలో, బీజేపీ 3 డివిజన్లలో, ఇతరులు 3 డివిజన్లలో విజయం సాధించారు.  30 సంవత్సరాల తర్వాత టీడీపీ కాకినాడ మునిసిపాలిటీని చేజిక్కించుకుంది. వైసీపీ

టీీడీపీ ఇక మేయర్ ఎంపికకు కసరత్తు ప్రారంభించింది. ఈ పీఠాన్ని కాపు వర్గానికే కేటాయిస్తామంటూ గతంలో టీీడీపీ నాయకత్వం ప్రకటించడంతో ఎవరిని ఆ పీఠంపై కూర్చోబెడతారనే అంశంపై చర్చ జరుగుతోంది.

కాకినాడ నగర మేయర్‌ బరిలో శేషకుమారి,  అడ్డూరి లక్ష్మి,  సుంకర పావని,  సుంకర శివప్రసన్న ఉన్నట్టు సమాచారం. మేయర్‌ ఎంపికపై తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి టీడీపీకి  ఇపుడు పట్టిందల్లా బంగారం అన్నట్టే ఉంది పరిస్థితి.