హోరాహోరీగా సాగిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 27,496 ఓట్ల తేడాతో వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని ఓడించాడు. భూమాకు 97, 106 ఓట్లు, మోహన్ రెడ్డికి 69,610 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ 1,357 తో మూడో స్థానంలో నిలిచింది. పోలైన ఓట్లలో టీడీపీకి 56 శాతం, వైకాపకు 40 శాతం ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో 2,18,858 ఓట్లు ఉండగా, ఈ నెల 23న జరగిన ఎన్నికల్లో 1,73,335 మంది (79.20 శాతం) ఓటేశారు.
సోమవారం ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించారు. తొలి రౌండు నుంచీ టీడీపీ ఆధిక్యం ప్రదర్శించింది. ఒక్క 16వ రౌండ్ లో మాత్రమే వైకాసా ఆధిక్యంలో కొనసాగింది. టీడీపీ గెలుపుతో పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.