ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతడు సోషల్ మీడియాలో టీడీపీ మహిళా నేతలు లక్ష్యంగా చేసుకుని అనుచిత చర్యలకు పాల్పడుతున్నాడని ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత మండిపడ్డాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె శనివారం విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భావన్ తన మాటలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అవి నిజమేనేమో అనుకుని కొందరు విమర్శలు చేస్తున్నారి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబును గద్దె దింపి, జగన్మోహన్ రెడ్డి సీఎం కావాని నేను అనలేదు. అలా అన్నానని నా మాటలను ఎడిట్ చేశాడు.
దాన్ని సాక్షి టీవీలో మహిళా దినోత్సవం రోజే ప్రసారం చేశారు,’’ అని అనిత వివరించారు. మహిళల సంక్షేమం కోసం పాటుబడుతున్నామని చెబుతూ మరోపక్క వారిపై ఇలా వేధింపులకు పాల్పడ్డం ఏమిటని ఆమె ప్రశ్నించారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న భార్గవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తండ్రి అండతో రాజకీయాల్లోకి వచ్చిన భార్గవ రెడ్డికి జగన్ వైకాపా సోషల్ మీడియా విభాగాల బాధ్యతలను అప్పగించారు. టీడీపీ టార్గెట్ చేసుకునే ఈ విభాగాలు ఇప్పుడు మహిళలను కూడా వదలిపెట్టడం లేదని పచ్చపార్టీ మండిపడుతోంది.