డబ్బులిస్తే వంగలపూడి అనితపై కేసు వాపసు తీసుకుంటా : టీడీపీ నేత - MicTv.in - Telugu News
mictv telugu

డబ్బులిస్తే వంగలపూడి అనితపై కేసు వాపసు తీసుకుంటా : టీడీపీ నేత

May 2, 2022

టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత చెక్ బౌన్స్ కేసులో సోమవారం విశాఖపట్టణం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2015లో వేగి శ్రీనివాసరావు అనే టీడీపీ నేత నుంచి అనిత రూ. 70 లక్షలు తీసుకున్నారు. అందుకు 2018లో అనిత చెక్ రాసిచ్చారు. కానీ, ఆ చెక్ బౌన్స్ అవడంతో శ్రీనివాసరావు 2019లో కోర్టులో కేసు వేశాడు. కేసు విచారణకు రావడంతో సోమవారం అనిత కోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో బాధితుడు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ‘ఎన్ని సార్లు డబ్బులడిగినా ఏదో వంక పెట్టి అనిత గారు తప్పించుకుంటున్నారు. అవసరానికి డబ్బులు తీసుకొని ఇవ్వకపోవడం అన్యాయం. సొంత పార్టీ నేతలను మోసం చేయడం బాధాకరం. నాలాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న అనిత గారు ఇలా చేయడం దుర్మార్గం. ఇప్పటికైనా నా డబ్బులు ఇచ్చేస్తే కేసు ఉపసంహరించుకొంటా’నంటూ వాపోయారు.