అత్యాచార నిందితుణ్ని కాపాడుతున్న జగన్.. లోకేశ్ ధ్వజం - MicTv.in - Telugu News
mictv telugu

అత్యాచార నిందితుణ్ని కాపాడుతున్న జగన్.. లోకేశ్ ధ్వజం

October 26, 2020

Tdp youth leader nara lokesh comments on ap cm jagan

టీడీపీ యూత్ లీడర్ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్ అత్యాచార కేసులో నిందితుడు అయిన తన సన్నిహితుడిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందుకోసం సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగి బాధితురాలిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా జి పాలకుర్తికి చెందిన 15 ఏళ్ళ బాలికపై ఇటీవల సామూహిక అత్యాచారం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. వారిని గుర్తు పట్టకుండా ఉండడానికి మొహానికి నల్లరంగు పూసుకున్నారు. ఆ బాలిక నోట్లో పురుగు మందు పోసి పరారయ్యారు. ఈ మేరకు బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీనిపై డోన్ డీఎస్పీ స్పందిస్తూ.. అసలు ఆ బాలికపై అత్యాచారం జరగలేదని, పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. అత్యాచారం జరగకపోయినా జరిగినట్టు ఫిర్యాదు చేశారని ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ట్వీట్ చేశారు. ‘క‌ర్నూలు జిల్లా దేవన‌కొండ మండ‌లం, జి. పాల‌కుర్తిలో రాజ‌కీయ‌ క‌క్ష‌ల‌తో జ‌గ‌న్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌రెడ్డి బాలిక‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డిన కేసులో A5 ముద్దాయి. ఆయనను కేసు నుండి తప్పించేందుకు ప్ర‌భుత్వ‌ పెద్ద‌లే రంగంలోకి దిగి బాధితురాలిని బెదిరించ‌డం జ‌గ‌న్‌రెడ్డి అరాచ‌క‌ పాల‌నకి నిద‌ర్శ‌నం. నిందితుడిని అరెస్టు చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నాను.’ అని లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే A5 ముద్దాయి ముద్దాయి సీఎం జగన్‌తో ఉన్న ఫోటోను సైతం లోకేష్ ట్వీట్‌కు జత చేశారు.