ఈ పార్టీ గెలుస్తది.... ఆ పార్టీ కూడా గెలుస్తది... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ పార్టీ గెలుస్తది…. ఆ పార్టీ కూడా గెలుస్తది…

August 24, 2017

లెక్కలు వచ్చిన వారు చేసినా.. రాని వారు చేసిన ఏ  ఫార్మూలా వాడినా ఆన్సర్ ఒక్కటే ఉండాలి. అట్లా లేదంటే అది  ముమ్మాటికీ తప్పే అని  అర్థం.  ఒకే లెక్కకు పది మంది పది రకాల ఆన్సర్లు ఇస్తే  దాంట్లో ఒకరిది మాత్రమే కరెక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అదీ కాదంటే అందరీ తప్పు కావొచ్చు. అయితే  ఉన్నదాంట్లోనే ఏదో ఒకటి కరెక్ట్ అనుకుందాం.

విషయం ఏందంటే. నంద్యాల ఉప ఎన్నికల్లో ఇరు పార్టీలు, మరింత మంది ఉత్సాహ వంతులు సర్వేలు చేయిస్తున్నారు. కొందరు వాటిని బయటికి విడుదల చేస్తున్నారు.  ఈ సర్వేలు కూడా తమ మనస్సుకు నచ్చినట్లు చేస్తున్నారో.. లేక పోతే తోచినట్లు చేస్తున్నారో తెలియదు. కాకాపోతే ఆత్మ సంతృప్తి  కోసం చేసుకుని లోపలోపల ఆనందిస్తామంటే ఏ ఇబ్బందీ లేదు. అయితే వాటిని పబ్లిక్ డోమైన్ లోకి తెస్తున్నారు.

ఓ సర్వేలో 50 నుండి 56 శాతం వరకు టిడిపికి అని ఒక సర్వే చెప్తే… కాదు కాదు… ఈ లెక్క రీవర్స్ చేసుకుంటే అదే కరెక్ట్ మని మరో సర్వే అంటున్నది. ఈ ఎన్నికలో  ఓటర్లు జగన్ వెంటే ఉన్నారు.  మెజార్టీ  10 వేలు దాటుతుంది. ఇందులో 3 నుండి 6 వరకు ప్లస్ ఆర్ మైనస్ అనుకుని చదువుకోండి. ఇందులో అటు ది ఇటు కావొచ్చు. ఇటుది అటుకావొచ్చు. ఇది కేవలం అంచనా మాత్రమే అని  సెలవిస్తుంది మరో సర్వే.

అయినా ఈసర్వే చేసేవాళ్ల కంటే సుద్దులు చెప్పే వాళ్లు…. జ్యోతిష్యం చెప్పే వాళ్లు బెటర్ కదా. ఏదోఒకటి గ్రహాల పేరుతో చెబితేసరిపోతుంది. ఏదో గ్రహం అనుకూలించ లేదని అనుకుంటే సరిపోతుంది. ఈ సర్వేలు చేసేటప్పుడు సమాధానం ఇస్తున్న వారి మూడ్ ఎట్లా ఉంటుందో తెలియదు. వారు చెప్పేది కరెక్ట్ అని చెప్పడానికీ వీలు లేదు. ఓటు ఎట్లాగో వేశాను కాబట్టి ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది కదా అనికుని ఉండొచ్చు కూడా. అందు వల్ల ఈ సర్వేలు లేని పంచాయితీలు… బీపీలు   తెచ్చి పెడుతున్నట్లుంది.

అంచేత ఈ సర్వేలు చేయిస్తున్న… చేస్తున్న వారికి  ముందుగా లెక్కలు నేర్పాల్సిన  తక్షాణావసరం ఉన్నట్లుంది. లేక పోతే ఈ తరహా లెక్కలు ముందు ముందు చెప్తే మరింత ఇబ్బందులు వచ్చి పడ్తాయి. కాబట్టి సర్వే… జనులారా… మీ లెక్కల్లో కూడికలు తీసి వేతలు  ఎట్లా ఉన్నా ఈవీఎంలలో భద్రంగా ఉన్న లెక్కలు మీ లెక్కలను కూడ సరి చేస్తాయి. అంతదాకా మీ  లెక్కల తికమక కట్టిపెట్టడం బెటర్ కావొచ్చు.