గిడ్డి ఈశ్వరి జంప్.. - MicTv.in - Telugu News
mictv telugu

గిడ్డి ఈశ్వరి జంప్..

November 27, 2017

అనుకున్నట్లుగానే వైకాపాకు చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కొంతసేపటి కిందట ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. బాబు ఆమెపై పచ్చకండువాను కప్పారు. అభివృద్ధికి నోచుకోని పాడేరు నియోజకవర్గానికి మరిన్ని నిధులను కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆమెకు హామీ ఇచ్చారు.  

2019 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈశ్వరితో పాటు పలువురు  సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరారు. ఈశ్వరి నిర్ణయంతో వైకాపా నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యలే సంఖ్య 22కు చేరింది. ముగ్గురు ఎంపీలు కూడా పచ్చకండువా కప్పుకున్నారు.

మరో నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే అవకాశముంది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు గుంటూరు జిల్లా ఎమ్మెల్యే టీడీపీతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీకి మూడు స్థానాలు లభిస్తాయి. ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే, టీడీపీకి 2,  వైకాపాకు 1 స్థానం దక్కుతుంది. మరో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు గోడదూకి టీడీపీ ఇంట్లోకి చెక్కేస్తే మొత్తం మూడు రాజ్యసభ సీట్లూ తమ్ముళ్లకే దక్కే చాన్సుంది.