Tea Time Snack Rusk Unhealthy..? Side Effects With Rusk
mictv telugu

రస్క్ తో రిస్క్ తప్పదా?

January 4, 2023


చాలామంది చాయ్ తో రస్క్ ని తినడానికి ఇష్టపడుతారు. ఆకలి అయినప్పుడు ఒక రస్క్ కడుపు నింపేస్తుంది. కానీ ఈ రస్క్ ఆరోగ్యానికి రిస్క్ చేస్తుందా?
రస్క్ వాస్తవానికి శుద్ధి చేసిన పిండి, చక్కెర, చౌక నూనెలు, అదనపు గ్లూటెన్, కొన్ని ఆహార సంకలనాల కాల్చిన మిశ్రమం తప్ప మరొకటి కాదు. ఈ కలయికలు ఆరోగ్యానికి హానికరం అని అంటున్నారు డాక్టరు. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుందట. తరుచుగా దీన్ని తీసుకోవడం వల్ల అస్థిరమైన గ్లూకోజ్ స్థాయిలు (ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తుంది), శరీరంలో జీవక్రియకు అసౌకర్యం ఏర్పడుతుంది. అంతేకాదు.. గట్ లో చెడు బ్యాక్టీరియా పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. ఇది కాకుండా ఇంకేం ప్రభావాలు చూపుతుందో చదువండి.

ఏమేం ఉంటాయంటే..

ఇందులో శుద్ధి చేసిన గోధుమపిండి, లేదా మైదాను వాడుతారు. ఇది ప్రాసెస్ చేయబడుతుంది. అందుకే ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు తీసివేయబడుతాయి. కాబట్టి ఇందులో ఫైబర్ కూడా ఉండదు. ఇక చక్కెర.. దీనివల్ల అదనపు క్యాలరీలు మీ ఒంట్లో చేరుతాయి. అంతేకాదు.. రెండు రస్క్ లు తింటే ఒంట్లో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. రిఫైన్డ్ వెజిటేబుల్ ఆయిల్ ఎక్కువగా ప్రాసెస్ చేయబడుతుంది. దీనివల్ల ఎటువంటి పోషక ప్రయోజనాలు ఉండవు. సుజీలో కూడా ఫైబర్, ఎటువంటి పోషకాలు ఉండవు. ఇంకా వీటికి కృత్రిమ రుచులు యాడ్ చేస్తారు. ఇవన్నీ మీకు ఎలాంటి ప్రయోజనాలూ కలిగించవు. ఇక ఇందులో కలిపి బ్రౌన్ కలర్ కూడా ఆరోగ్యానికి హానికరం.

గుర్తుంచుకోండి..

ఒకవేళ రస్క్ ఇష్టపడితే కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. మల్టీగ్రెయిన్ రస్క్ లో మైదా కూడా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ 100శాతం హోల్ వీట్ లేదా 100 శాతం సెమోలినా రస్క్ కోసం వెతకండి అంటున్నారు డాక్టర్లు. లేబుల్స్ చదువడం మంచి పద్ధతి. అలాగే ఒకటి రెండింటితో సరిపెట్టుకోండి. ఏదైనా అధికం కోసం చూస్తే మొదటికే మోసానికి వస్తుంది. రస్క్ కొనేముందు లేబుల్స్ చదివిన తర్వాతే కొనడం మాత్రం మరచిపోవద్దు.

 

ఇవి కూడా చదవండి : 

ప్రపంచాన్ని భయపెట్టిన గొయ్యి

ఇండియా డాన్స్ సూపర్ మామ్

కాళేశ్వరానికి డీపీఆరే లేదు.. ఎన్ని సార్లు డిజైన్ మార్చిర్రు..ఎవరికోసం మార్చిర్రు.. అన్ని తెలుసు మాకు