పాఠం చెబుతూ ప్రాణాలు కోల్పోయిన సార్.. - MicTv.in - Telugu News
mictv telugu

పాఠం చెబుతూ ప్రాణాలు కోల్పోయిన సార్..

October 28, 2019

తరగతి గదిలో అప్పటివరకు శ్రద్ధతో పాఠాలు బోధిస్తున్న మాస్టారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పిల్లలు.. ‘సార్, సార్.. ’ అంటూ బిగ్గరగా రోదించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలకట్టె ఎస్సా కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ విషాదం చోటుచేసుకుంది. 

Teacher

ప్రధానోపాధ్యాయుడు విజయ్ సింగ్ పాఠం చెబుతూ చెబుతూ కుర్చీలో కుప్పకూలిపోయారు. పిల్లలు భయపడిపోయి ఇతర ఉపాధ్యాయులకు విషయం చెప్పారు. వారు అక్కడికి చేరుకునే లోపు ఆయన తుదిశ్వాస విడిచారు. పిల్లలు, టీచర్లు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.