14 ఏళ్ల స్టూడెంట్‌తో 26 ఏళ్ల టీచరమ్మ జంప్ - MicTv.in - Telugu News
mictv telugu

14 ఏళ్ల స్టూడెంట్‌తో 26 ఏళ్ల టీచరమ్మ జంప్

January 20, 2020

bg

విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్ విద్యార్ధిపై వలపు వల విసిరింది. గురువు స్థానంలో ఉండి కూడా విచక్షణ మరిచిన ఓ 26 సంవత్సరాల టీచరమ్మ 14 ఏళ్ల బాలుడితో జంప్ అయింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ కొడుకును టీచర్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లిందని ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని పారిపోయిన వారి కోసం గాలింపు చేపట్టారు. 

8వ తరగతి చదవుతున్న ఆ బాలుడితో మహిళా టీచర్ ఏడాదిగా సన్నిహితంగా ఉంటున్నట్టు ఆ బాలుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి విషయం తెలిసి మందలించడంతో ఇంటి నుంచి కనిపించకుండా పారిపోయారని తెలిపాడు. తమ కొడుకును టీచర్ నుంచి తిరిగి ఇంటికి చేర్చాలని కోరారు. ఒక టీచర్ విద్యార్ధితో జంప్ అవడం స్థానికంగా చర్చకు దారితీసింది. మైనర్ బాలుడిపై ప్రేమ వల విసిరిన టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి తండ్రి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా పోలీసులు వెల్లడించారు. ఒక మహిళా టీచర్ తన టీనేజ్ విద్యార్థినితో పారిపోవడం అరుదైన కేసుగా వారు పేర్కొన్నారు. కాగా గతంలో ఢిల్లీ,కేరళ లాంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు నమోదు అయ్యాయి.