మహమ్మద్ కార్టూన్ చూపాడని టీచర్ తల నరికేశాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

మహమ్మద్ కార్టూన్ చూపాడని టీచర్ తల నరికేశాడు.. 

October 17, 2020

nvgng

ఇస్లాం మత వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త కార్టూన్లను పాఠ్యాంశంలో భాగంగా ప్రదర్శించిన ఉపాధ్యాయుడిని మతోన్మాదం తలకెక్కిన ఓ దుర్మార్గుడు అత్యంత దారుణంగా తల నరికి చంపేశాడు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ సమీపంలో కాన్‌ఫ్లాన్స్ సెయింట్ హనరోనీ ఈ ఘోరం జరిగింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఆవశ్యకతను వివరిస్తూ చరిత్ర ఉపాధ్యాయుడు హమ్మద్‌ ప్రవక్త కార్టూన్లు చూపించారు. అయితే ప్రవక్త చిత్రాలు ఇస్లాంలకు విరుద్ధమని కొందరు ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో శుక్రవారం స్కూట్ బయట ఆ ఉపాధ్యాయుడిని ఓ గుర్తుతెలియని దుండుగుడు కత్తితో నరికేశాడు. తల వేరుపడింది. పోలీసులు ఆ దుర్మార్గుడిని అక్కడిక్కడే కాల్చి చంపేశారు. టీచర్ హత్య పక్కా ఉగ్రవాదమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ మండిపడ్డారు. 2015లో పారిస్‌లోని చార్లీ హెబ్డో వ్యంగ్య పత్రిక కార్యాలయంలో, ఓ సూపర్‌ మార్కెట్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి పదుల సంఖ్యలో జర్నలిస్టులను, ప్రజలను చంపేశారు. ఆ కేసుపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఒకడిని దోషిగా తేల్చిన కోర్టు  28 ఏళ్ల జైలు శిక్ష వేసింది. దీంతో ప్రతీకార దాడులు జరుగుతాయని పోలీసులను అప్రమత్తం చేశారు.