Teacher love proposal to student in classroom in asom
mictv telugu

క్లాస్‌రూంలో స్టూడెంట్‌కు టీచర్ లవ్ ప్రపోజల్.. పిక్స్ వైరల్

July 8, 2022

తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన టీచరు ఓ విద్యార్ధినిపై మనసు పారేసుకున్నాడు. అంతేకాక, సమయం, సందర్భం చూసుకోక ఏకంగా క్లాసురూంలోనే లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ విషయం బయటికి పొక్కడంతో టీచరుతో పాటు సదరు విద్యార్ధినిని కూడా అధికారులు సస్పెండ్ చేశారు. వైరల్ అవుతున్న ఈ ఘటన అసోం రాష్ట్రంలో జరిగింది. ధామాజీ పట్టణానికి చెందిన మనోజ్ కుంబంగ్ అనే టీచర్.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్య యోజన ట్రైనింగ్ సెంటరులో పనిచేస్తున్నాడు. నిరుద్యోగులైన యువతీ యువకులకు వివిధ కోర్సులలో తగిన శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగం కల్పించేందుకు కేంద్రం ఈ శిక్షణ కేంద్రాలను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. ఇలాంటి సెంటరులో పనిచేసే మనోజ్.. శిక్షణకు వచ్చే ఓ విద్యార్ధినిని ప్రేమించాడు. దీంతో ఆ అమ్మాయికి క్లాసురూంలోనే అందరి ముందు సినిమా స్టైల్లో మోకాళ్ల మీద కూర్చుని పువ్వు ఇస్తూ లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి అతని ప్రేమను అంగీకరించిందో లేదో తెలియదు. కానీ, ఈ ఘటనను తోటి విద్యార్ధులు తమ ఫోన్లలో రికార్డు చేసి షేర్ చేయడంతో ఈ విషయం బయటికి పొక్కింది. దీనిపై స్పందించిన అధికారులు.. టీచరు మనోజ్‌తో పాటు సదరు విద్యార్ధినిని కూడా సస్పెండ్ చేశారు. అంతేకాక, ఈ తతంగాన్ని వీడియో తీసిన విద్యార్ధులపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.