ఆర్మీ స్కూళ్లలో 8000 టీచర్ పోస్టులు  - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్మీ స్కూళ్లలో 8000 టీచర్ పోస్టులు 

September 12, 2019

teacher posts recruitment in army public school.

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడింది. పీజీ, డిగ్రీలతో బీఈడీ చేసిన వారు అర్హులు. 8 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీఈటీ), ప్రైవరీ టీచర్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఫ్రెషర్లకు 40లోపు, అనుభవం ఉన్నవారికి 57లోపు వయోపరిమితిగా విధించారు. అభ్యర్థులు తమ విద్యార్హత కోర్సులో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ నెల 22 లోపు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దశలవారీగా పరీక్షలతో నియమకాలను పూర్తి చేస్తారు. స్కోరింగ్ కార్డులు కూడా ఇస్తారు. వీటిని మూడేళ్ల వరకు వాడుకోవచ్చు.

పూర్తి వివరాలకు 

http://aps-csb.in/College/Index_New.aspx క్లిక్ చేయండి.. 

http://aps-csb.in/PdfDocuments/GeneralInstructionCan.pdf