ఏపీ నిరుద్యోగులకు స్వీట్.. 9 వేల టీచర్ పోస్టులకు షెడ్యూల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ నిరుద్యోగులకు స్వీట్.. 9 వేల టీచర్ పోస్టులకు షెడ్యూల్

October 6, 2018

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీడీపీ ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించింది. శుక్రవారం ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు.

gg

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సంక్షేమ శాఖలు పురపాలిక, జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో కలిపి మొత్తం 9,275 పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటిని డీఎస్పీ పరీక్షల ద్వారానే భర్తీ చేస్తామన్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ), ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లను కలిపే చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్షను ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తామని తెలిపారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించనున్నారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణిని మంత్రి గంటా ఆదేశించారు.

షెడ్యూల్‌ ఇలా..

  • టీఆర్టీ, టెట్ నోటిషికేషన్ 10.10.2018
  • దరఖాస్తు రుసుము చెల్లింపు 10.10.2018 నుంచి  02.11.2018 వరకు
  • దరఖాస్తు సమర్పణకు తుది గడువు 03.11.2018
  • హాల్టికెట్ డౌన్లోడ్ 20.11.2018 నుంచి
  • పరీక్ష నిర్వహణ 30.11.2018 నుంచి 14.12.2018 వరకు
  • ప్రాథమిక కీ విడుదల 16.12.2018
  • అభ్యంతరాల స్వీకరణ 16.12.2018 నుంచి 23.12.2018 వరకు
  • తుది కీ విడుదల 27.12.2018
  • ఫలితాలు 03.01.2019