హెడ్మాస్టర్ కంట్లో కారం కొట్టిన టీచర్ - MicTv.in - Telugu News
mictv telugu

హెడ్మాస్టర్ కంట్లో కారం కొట్టిన టీచర్

November 18, 2019

Teacher through chilly powder into principals eyes 

విద్యార్థులకు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కిరాయి గుండాగా ప్రవర్తించాడు. మెదక్ జిల్లాలోని చేగుంట మండలం, రెడ్డిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడి కంట్లో కారం కొట్టి పారిపోయాడు. 

విద్యార్థులకు సరిగ్గా పాఠాలు చెప్పాలని, సమయపాలన పాటించాలంటూ ఉపాధ్యాయుడు  శ్రీనివాసమూర్తిని, ప్రధానోపాధ్యాయుడు దేవరుషి హెచ్చరించారు. దీనిని సహించలేని ఉపాధ్యాయుడు శ్రీనివాసమూర్తి ప్రధానోపాధ్యాయుడిపై కక్ష పెంచుకున్నాడు. దేవరుషి ఆఫీస్ గదిలో ఉన్న సమయంలో శ్రీనివాసమూర్తి అతడి కంట్లో కారం కొట్టి పారిపోయాడు. దీంతో సహచర ఉపాధ్యాయులు దేవరుషిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు.