ఏపీ మద్యం షాపుల వద్ద టీచర్లకు డ్యూటీ.. బుద్ధుందా?  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ మద్యం షాపుల వద్ద టీచర్లకు డ్యూటీ.. బుద్ధుందా? 

May 5, 2020

Teachers  at liquor shop duties 

చదవేస్తే ఉన్నమతి పోయినట్లుంది ఏపీ పోలీసులు తీరు. మద్యపానం ప్రమాదకరమని బోధించే టీచర్లతో ఏకంగా మద్యం దుకాణాల ముందు కాపలా కాయించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మందు అమ్ముకోడానికి టీచర్లతో ఇలాంటి పనులు చేయిస్తారా అని మండిపడుతున్నాయి. అయితే ఇది కూడా కరోనా డ్యూటీ అని సరిపెట్టుకోవాలని పోలీసులు ఉచిత సలహా ఇస్తున్నారు. 

విశాఖ జిల్లాలో సోమవారం పలు మద్యం దుకాణాల వద్ద పోలీసులతోపాటు, ఉపాధ్యాయులకు కూడా డ్యూటీ వేశారు. మందుబాబులను నియంత్రించాలని అయ్యోర్లను ఆదేశించింది. ఇప్పటికే కోవిడ్ విధుల్లో ఉన్న టీచర్లకు ఈ పనికిమాలిన పనిని అదనంగా కట్టబెట్టారు.  బుచ్చెయ్యపేట, వడ్డాది, బుచ్చెయ్యపేట, రాజాం, సీతయ్యపేటల్లో ఒక్కో షాపు వద్ద ఇద్దరు చొప్పున టీచర్లను కాపలాగా నిలబెట్టారు. దీంతో వారు సిగ్గుతో చితికిపోయారు. అయినా చేసేదేమీ లేక నోరుమూసుకుని ‘విధులు’ నిర్వహించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీచర్లను ఇలాంటి పనులకు వాడుకోవద్దంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని మందు విధుల నుంచి తప్పిస్తూ విద్యాశాఖ అధికారి పోలీసులను ఆదేశించారు. అయితే సిబ్బంది కొరత పేరుతో ఇంకా టీచర్లను పోలీసులు షాపుల వద్దకు తీసుకెళ్లారు.