సెప్టెంబర్ 4 లోగా టీచర్ల భర్తీ .. సుప్రీంలో ఏపీ   - MicTv.in - Telugu News
mictv telugu

సెప్టెంబర్ 4 లోగా టీచర్ల భర్తీ .. సుప్రీంలో ఏపీ  

August 19, 2019

Teachers should be appointed

సెప్టెంబర్‌ 4లోపు ఏపీలో ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేస్తామని, పాఠశాలల్లో వసతులపై న్యాయస్థానం ఆదేశాలను అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం  హామీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకంలో జాప్యంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈ రోజ విచారణ జరిగింది. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్కే జోషి అఫిడవిట్లు దాఖలు చేశారు. 

ఏపీ సీఎస్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీం సంతృప్తి వ్యక్తం చేసింది. 6 నెలల్లోపు నియామకాలు, మౌలిక వసతుల కల్పనపై తమ ఆదేశాలు పాటించాలని ఏపీ ప్రభుత్వానికి  కోర్టు ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ అంశాన్ని వచ్చేవారం విచారిస్తామని జస్టిస్‌ అరుణ్‌మిశ్రా ధర్మాసనం తెలిపింది. తెలంగాణలోనూ 2వేల ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి చేశామని.. మరో 4,444 పోస్టుల భర్తీపై హైకోర్టులో పిటిషన్‌ ఉండటంతో ఆలస్యం అవుతుందని సీఎస్‌ జోషి అఫిడవిట్‌ దాఖలు చేశారు.