శ్రీలంకతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మొదటి టీ20లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగింది. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ బరిలోకి దిగగా, గిల్ 7 పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం మొదటి డౌన్లో వచ్చిన మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ కూడా 7 పరుగులే చేసి కరుణరత్నే బౌలింగులో పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులుగా ఉంది. ఇక రెండో మ్యాచ్ జనవరి 5న, మూడో టీ20 జనవరి 7న జరుగుతాయి. కాగా, ఈ మ్యాచులో సీనియర్లు రోహిత్, కోహ్లీ, రాహుల్‌లకు విశ్రాంతి ఇవ్వగా శివంమావి, శుభ్ మన్ గిల్, సంజూ శామ్సన్ కొత్తగా జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్ 24 (20 బంతులు), సంజు శాంసన్ మూడు పరుగులతో ఉన్నారు.