Better late than never.🏏😎#BottleCapChallenge pic.twitter.com/mjrStZxxTi
— Virat Kohli (@imVkohli) August 10, 2019
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ ట్రెండ్ అవుతుంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి తమ టాలెంట్ ప్రదర్శించారు. ఎందరో ప్రముఖులు సోషల్ మీడియాలో తాము చేసిన విన్యాసాల్ని అభిమానులతో పంచుకున్నారు.
తాజాగా టీమ్ఇండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ కూడా కాస్త వెరైటీగా, క్రికెటర్‌గా ఆలోచించి వినూత్న ప్రయత్నం చేశాడు. సహజంగా ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ అంటే.. మూత ఉన్న నీళ్ల బాటిల్‌ను ఒక కాలితో తంతూ ఓపెన్ చేయడమే. అయితే కోహ్లీ మాత్రం తన బ్యాట్‌తో ఈ ఛాలెంజ్‌ని పూర్తి చేశాడు. ఈ వీడియోను కోహ్లీ తన ట్విటర్లో పోస్టు చేస్తూ..‘ఎప్పటికీ చేయకపోవడం కన్నా ఆలస్యంగానైనా చేశా’ అనే క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మెడిలో వైరల్ అవుతుంది.