విరాట్ కోహ్లీ కులాసారాయుడు. నవ్వుతూ నవ్విస్తూ ఎంత సందడి చేస్తాడో కోపం వస్తే ఏ మాత్రం తట్టుకోలేడు. తనను రెచ్చగొట్టేవాళ్లకు అంతే ఘాటుగా బదులిస్తుంటాడు. ఆటలో ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే అసలు ఊరుకోడు. తాజా బంగ్లాతో చివరి టెస్టులో కోహ్లీ ముక్కోపిగా మారాడు. ‘‘ఆ బట్టలు కూడా విప్పేయ్,’’ అంటూ ఓ ఆటగాడితో తీవ్ర అసహనం ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. శుక్రవారం చివరి టెస్టు రోజు ఆటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆరో ఓవర్ వేస్తుండగా ఆఖరి బంతికి ముందు బంగ్లా ఆటగాడు షాంటో షూష్ సాక్సులను సరిచేసుకుంటూ కనిపించాడు. అయితే అప్పటికే చీకటి పడుతుండడంతో మరిన్ని ఓవర్లు వేయలేమని టీమిండియా ఆందోళనపడింది. షాంటో సాక్సులతో కుస్తీ పడుతుండంతో సమయం వృథా అవుతోందని కోహ్లీ చిరాకుపడ్డాడు. ‘‘కపడే భీ ఉతర్ దే‘ అంటూ వేలు చూపుతూ, చొక్కా పైకెత్తుతూ కోపం ప్రదర్శించాడు. ఆ ఓవర్ తర్వాత చీకటిపడడంతో ఆటను ముగించారు. ఈ సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 314 పరుగులకు ఆలౌట్ అయింది బంగ్లాపై 87 పరుగుల ఆధిక్యం సాధించింది.
Kohli to Shanto: "Kapde bhi utaar de" when shanto tried to waste time on tieing shoe laces 😭🤣 #ViratKohli #INDvBAN pic.twitter.com/mzFSDb8dkO
— Keshav Bhardwaj 🇮🇳 (@keshxv1999) December 23, 2022