ఆసీస్‌పై భారత్ ఘనవిజయం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆసీస్‌పై భారత్ ఘనవిజయం..

June 10, 2019

Team india defeat australia in world cup match.

ప్రపంచకప్‌లో భారత్ విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీంఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.

టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు అద్భుతంగా రాణించారు. రోహిత్ శర్మ 57 పరుగులు చేయగా, శిఖర్ ధవన్ 109 బంతుల్లో 16 ఫోర్లతో 117 పరుగులతో చెలరేగిపోయాడు. కెప్టెన్ కోహ్లీ 82 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులతో రెచ్చిపోయాడు. ధోనీ 14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 27 పరుగులు చేశాడు. లోకేశ్ రాహుల్ 11 పరుగులు చేశాడు. దీంతో భారత్ 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. తరువాత లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 316 పరుగులకే ఆలౌటై ప్రపంచకప్‌లో తొలి ఓటమిని చవిచూసింది. డేవిడ్ వార్నర్ (56), అరోన్ ఫించ్ (36), స్టీవెన్ స్మిత్ (69), ఉస్మాన్ ఖావాజా (42), అలెక్స్ కేరీ (55)లు రాణించినప్పటికి ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లు ఆసీస్‌ను కట్టడి చేయడంతో కీలక పాత్ర పోషించారు.