Team India is now at home.. unless something miraculous happens..
mictv telugu

టీమిండియా ఇక ఇంటికే..ఏదైనా అద్భుతం జరిగితే తప్పా..

September 7, 2022

ఆసియా కప్ మ్యాచ్‌లు ప్రారంభమైన రోజు నుంచి గతరాత్రి వరకు ఆయా జట్ల మధ్య ఉత్కంఠభరితంగా యుద్ధం జరిగింది. మ్యాచ్‌లను వీక్షించిన ప్రేక్షకులను టెన్షన్‌కు గురిచేశాయి. కచ్చితంగా ఈ మ్యాచ్‌లో ఫలానా టీం గెలుస్తుందని ఫ్యాన్స్ వేసుకున్న అంచనాలను తారుమారు చేస్తూ, యువ ఆటగాళ్ల చేలరేగిపోయి విజయ ఢంకాను మోగిస్తున్నారు.

తాజాగా గతరాత్రి భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. ఈ ఓటమితో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గెలవాల్సిన కీలక మ్యాచ్‌ల్లో పరాజయం కావడంతో ఫైనల్‌కు చేరే అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. అంటే టిమిండియా జట్టు కూడా ఇంటిబాటను పట్టనుంది. ప్రస్తుతానికి అధికారికంగా మాత్రమే పోటీలో ఉంది. టీమ్‌ఇండియా..తుదిపోరుకు అర్హత సాధించాలంటే, ఏదైనా అద్భుతం జరగాల్సిందే తప్పా, ఛాన్స్ అయితే లేదు.

మొదటగా టాస్ ఓడిన టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ (41 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు)తో ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, సూర్యకుమార్‌ యాదవ్‌ (34) ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (0) డకౌట్‌ కాగా, వరుసగా మూడో మ్యాచ్‌లో రాహుల్‌ (6) నిరాశపరిచాడు. మిడిలార్డర్‌లో హార్దిక్‌ పాండ్యా (17), రిషబ్‌ పంత్‌ (17) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.

అనంతరం బ్యాటింగ్ చేసినశ్రీలంక జట్టు..19.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఓపెనర్లు పతుమ్‌ నిసాంక (52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుషాల్‌ మెండిస్‌ (37 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకుంటే, చివర్లో కెప్టెన్‌ దసున్‌ షనక (18 బంతుల్లో 33 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), భానుక రాజపక్స (25 నాటౌట్‌; 2 సిక్సర్లు) ఒత్తిడికి ఎదురు నిలిచి జట్టును గెలిపించారు. భారత బౌలర్లలో చాహల్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. దసున్‌ షనకకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది. టీమ్‌ఇండియా తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.