టీం ఇండియా సూపర్ ఫ్యాన్ బామ్మ ఇకలేరు - MicTv.in - Telugu News
mictv telugu

టీం ఇండియా సూపర్ ఫ్యాన్ బామ్మ ఇకలేరు

January 16, 2020

India Oldest Fan.

టీం ఇండియా సూపర్ ఫ్యాన్ బామ్మ కన్నుమూశారు. వృద్ధ వయస్సులో కూడా యూత్‌తో కలిసి స్టేడియంలో ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూ ఎంతో ఆకట్టుకున్న చారులతా పటేల్ ఆనారోగ్యంతో మరణించారు. ఆమె మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఆమె దూరమైనా ఎప్పుటికీ తమ హృదయాల్లో ఉండిపోతారని పేర్కొంది. 

2019 వరల్డ్ కప్ సమయంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ 87 ఏళ్ల బామ్మ స్టేడియంలో సందడి చేశారు. ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ యూత్‌తో పాటు ఈలలు వేస్తూ కనిపించారు. ఆమె చూసిన టీం ఇండియా ఆటగాళ్లు మైమరిచిపోయారు. కెప్టెన్ కొహ్లీ ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. అప్పట్లో ఈ ఓల్డ్ ఏజ్ ఫ్యాన్ అందరికి సుపరిచితులు అయ్యారు. కాగా చారులతా పటేల్ 1975లో లండన్ వెళ్లి స్థిరపడిపోయారు. 1983లో లండన్‌లోని లార్డ్స్ మైదానంలో కపిల్ దేవ్ సేన వరల్డ్ కప్ ను తొలిసారిగా దక్కించుకున్న సమయంలో ఆమె అక్కడే ఉన్నారు. అప్పటి నుంచి తరుచూ టీం ఇండియా మ్యాచ్‌లు చూస్తూ పాల్గొంటున్న ఆమె ఇటీవల అతి వృద్ధ వయసులో కూడా స్టేడియంకు రావడం అందరిని ఆకట్టుకుంది.