షమీ ధాటికి బంగ్లా ఆటగాళ్ళు విలవిల - MicTv.in - Telugu News
mictv telugu

షమీ ధాటికి బంగ్లా ఆటగాళ్ళు విలవిల

November 16, 2019

బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగుస్తోంది. పేసర్ షమీ ధాటికి బంగ్లా టైగర్లు విలవిలాడుతోన్నారు. షమీ తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మూడో వికెట్ తీశాడు. క్రీజులో నిలదొక్కుకొనేందుకు ప్రయత్నిస్తున్న మహ్మదుల్లా (15)ను ఔట్ చేశాడు. 

Team India.

షమి 26.3వ బంతిని కాస్త ఆఫ్ సైడ్ వేశాడు. బాడీకి దూరంగా వెళ్తున్న బంతిని మహ్మదుల్లా ఆడాడు. బ్యాటు అంచుకు తగలిన బంతి స్లిప్‌లో ఫీల్డర్ రోహిత్ చేతుల్లో పడింది. ప్రస్తుతం బాంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. మరో 5 వికెట్లు తీస్తే భారత్ విజయం సాధిస్తుంది. ప్రస్తుతం లిటన్ దాస్ (33) ముష్ఫికర్ రహీమ్ (35) క్రీజులో ఉన్నారు.