భారత్-ఆస్ట్రేలియా షెడ్యూల్ ఇదే.. - MicTv.in - Telugu News
mictv telugu

భారత్-ఆస్ట్రేలియా షెడ్యూల్ ఇదే..

October 28, 2020

Team India schedule for australia tour

ఐపీఎల్ తరువాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెల్సిందే. ఈ మేరకు నిన్న బీసీసీఐ జట్ల వివరాలను ప్రకటించింది. తాజాగా పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో నవంబర్ 27న తొలి వన్డే జరుగనుంది. 2021, జనవరి 15న నాలుగో టెస్టు మ్యాచ్‌తో ఈ పర్యటన ముగుస్తుంది. ఈ పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరుగనున్నాయి. ఐపీఎల్ 2020 నవంబరు 10తో ముగిసిన తరువాత భారత ఆటగాళ్లు నేరుగా యూఏఈ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్లనున్నారు. అక్కడ 14 రోజులు క్వారంటైన్‌లో ఉండి మ్యాచులు ఆడతారు. ఈ పర్యటనకు రోహిత్ శర్మ దూరం అయ్యాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌కు గాయం అయిన విషయం తెల్సిందే. దీంతో సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. అతని స్థానంలో శుబ్మాన్ గిల్‌ను జట్టులోకి తీసుకున్నారు.

వన్డే షెడ్యూల్:

* తొలి వన్డే నవంబరు 27 – సిడ్నీ (ఉదయం 8:30)

* రెండో వన్డే నవంబరు 29- సిడ్నీ (ఉదయం AM)

* మూడో వన్డే డిసెంబరు 1- మనుకా ఓవల్ (ఉదయం AM)

టీ20 షెడ్యూల్:

* తొలి టీ20 మ్యాచ్ డిసెంబరు 4 – మనుకా ఓవల్ (12:30 మధ్యాహ్నం)

* రెండో టీ20 మ్యాచ్ డిసెంబరు 6- సిడ్నీ (1:30 మధ్యాహ్నం)

* మూడో టీ20 మ్యాచ్ డిసెంబరు 8- సిడ్నీ (1:30 మధ్యాహ్నం)

ప్రాక్టీస్ మ్యాచ్ షెడ్యూల్:

  1. తొలి ప్రాక్టీస్ మ్యాచ్ డిసెంబరు 6- డ్రమ్మోయిన్ ఓవల్, సిడ్నీ
  1. రెండో ప్రాక్టీస్ మ్యాచ్ డిసెంబరు 11- సిడ్నీ- డే/నైట్

టెస్టు షెడ్యూల్:

  1. తొలి టెస్టు మ్యాచ్ డిసెంబరు 17న- అడిలైడ్ ఓవెల్ (2:00 మధ్యాహ్నం)- డే/నైట్ టెస్టు
  1. రెండో టెస్టు మ్యాచ్ డిసెంబరు 26న- మెల్‌బోర్న్ (4:30 ఉదయం)
  1. మూడో టెస్టు మ్యాచ్ జనవరి 7న- సిడ్నీ (4:30 ఉదయం)
  1. నాలుగో టెస్టు మ్యాచ్ జనవరి 15న- గబ్బా (5:30 ఉదయం)

ఈ పర్యటనకు వెళ్లనున్న భారత జట్ల వివరాలు

వన్డే జట్టు : విరాట్ కోహ్లీ (c), శిఖర్ ధావన్, శుబ్మాన్ గిల్, కేఎల్ రాహుల్ (vc& w), శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైని, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ

టీ20 జట్టు : విరాట్ కోహ్లీ (c), శిఖర్, మయాంక్ అగర్వాల్, సంజు సామ్సన్ (w), కేఎల్ రాహుల్ (vc&w), శ్రేయాస్ అయ్యర్, మనీష్, హార్దిక్ పాండ్యా,  రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, నవదీప్ సైని

టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లీ (c), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, సాహా (w), రిషబ్ పంత్ (w), అజింక్య రహానే (vc), హనుమా విహారీ, శుబ్మాన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, నవదీప్ సైని, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, మహ్మద్ సిరాజ్