కోహ్లీకి అరుదైన గౌరవం.. - MicTv.in - Telugu News
mictv telugu

కోహ్లీకి అరుదైన గౌరవం..

September 9, 2019

Virat Kohli.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన గౌరవాన్ని పొందుతున్నాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఓ స్టాండ్‌కు కోహ్లీ పేరు పెట్టాలని ఢిల్లీ క్రికెట్ సంఘం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి టీమిండియా ఆటగాళ్లంతా హాజరు కానున్నారు. 

ఈ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరగనుంది. వేడుక అనంతరం భారత జట్టు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం ధర్మశాలకు పయనం అవుతారు. ఇదిలావుండగా.. ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి కూడా పేరు మారుస్తున్నట్టు తెలిపారు. ఇటీవలే కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్మారకార్థం ఆయన పేరిట నామకరణం చేస్తారట. గతంలో ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా జైట్లీ పనిచేశారు.