మిథాలీ సేన సూపర్ సక్సెస్...! - MicTv.in - Telugu News
mictv telugu

మిథాలీ సేన సూపర్ సక్సెస్…!

July 24, 2017

కల చెదిరింది..కప్పు చేజారింది. ఓడితేనేం.. కప్పు చేజారితేనేం.. అద్భుతమైన పోరాటపటిమతో మిథాలీసేన కోట్లాది భారతీయుల మనసులు గెలిచింది. మహిళల క్రికెట్‌నూ విశేషంగా ఆదరించేలా చేయడంలో సక్సెస్ అయింది. ఆడోళ్ల క్రికెట్ అని లైట్ తీస్కోనేటోళ్లకు స్ట్రాంగ్ ఆన్సార్చింది. క్రికెట్ క్రికెటే..అక్కడైనా..ఇక్కడైనా ఒకే మజా అని ఫ్రూవ్ చేసింది. ఈ విషయంలో మిథాలీ సేన సక్సెస్ అయింది.

వరల్డ్ కప్ డ్రీమ్ ని వుమెన్స్ టీమిండియా చివ‌ర్లో ఒత్తిడితో ట్రోఫీని దూరం చేసుకుంది. 28 ప‌రుగుల తేడాలో చివ‌రి 7 వికెట్ల‌ను కోల్పోయి.. చేతిలోకి వ‌చ్చింద‌నుకున్న ట్రోఫీని చేజార్చుకుంది. అయినా త‌మ టీమ్‌ను చూసి ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని అంటున్న‌ది కెప్టెన్ మిథాలీ రాజ్‌. ఆమె మాట్లాడుతూ “ఇంగ్లండ్ కూడా అంత తేలిగ్గా గెల‌వ‌లేదు. అయితే వాళ్లు ఒత్తిడిని జ‌యించారు. మ్యాచ్ ఒక ద‌శ‌లో రెండు టీమ్స్‌కు స‌మ అవ‌కాశాలు క‌ల్పించింది. కానీ మేం భ‌య‌ప‌డ్డాం. అదే మా ఓట‌మికి దారి తీసింది” అని మిథాలీ అంది. ఇక త‌న భ‌విష్య‌త్తుపై స్పందిస్తూ.. మ‌రో రెండేళ్లు టీమ్‌లో ఉంటాన‌ని, వ‌చ్చే వ‌ర‌ల్డ్‌క‌ప్ మాత్రం ఆడ‌న‌ని స్ప‌ష్టంచేసింది. త‌మ ప్ర‌ద‌ర్శ‌న చూసి ఇక నుంచి ఇండియాలో మ‌హిళ‌ల క్రికెట్‌ను చూసే విధానం మారుతుంద‌ని మాత్రం మిథాలీ అంటోంది. కప్పు కన్న దేశానికి ,ముఖ్యంగా వుమెన్స్ టీమిండియాకు కావాల్సింది ఇదే.