వుమెన్స్ క్రికెట్లో భారత స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్ హిస్టరీ క్రియేట్ చేసింది. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌వుమన్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించిన మిథాలీ 34వ పరుగు దగ్గర.. ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్ (5992) పేరిటున్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 6028 రన్స్ ఉన్నాయి. 183 వన్డేలు ఆడిన మిథాలీ.. 164వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఎడ్వర్డ్స్‌తో పోల్చుకుంటే ఆమె 16 ఇన్నింగ్స్ తక్కువ ఆడింది. మిథాలీ అత్యధిక పరుగుల రికార్డు సాధించడంతో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తో పాటు గంబీర్ , కుంబ్లేలు ఆమెను ట్విటర్లో అభినందించారు.
TEAM INDIA WOMENS/MITHALI/6000 RUNS/RECORD