టీం ఇండియా మరో రికార్డు.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి.. - MicTv.in - Telugu News
mictv telugu

టీం ఇండియా మరో రికార్డు.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి..

November 8, 2019

బంగ్లాదేశ్‌తో గురువారం రాజ్‌కోట్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీం ఇండియా మరో రికార్డును కైవసం చేసుకుంది. గతంలో ఆస్ట్రేలియాకు ఉన్న ఈ రికార్డును ఇండియా చేజిక్కించుకుంది. చేజింగుల్లో అత్యధిక మ్యాచులు గెలిచిన టీంగా ఈ ఘనత సాధించింది. దీంతో మరోసారి  క్రికెట్ ప్రపంచంలో ఇండియా బేష్ అని అనిపించుకుంది. 

Team India.

గతంలో ఆస్ట్రేలియా టీ 20ల్లో 69 మ్యాచుల్లో చేజింగ్‌కు దిగి 40 సార్లు విజయం సాధించింది. తాజాగా టీం ఇండియా ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇండియా 61 మ్యాచుల్లో చేజింగ్‌కు దిగి 41 మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో ఆసీస్ పేరిట ఉన్న వరల్డ్‌ రికార్డును  చెరిపేసింది. అంటే అంటే ఆస్ట్రేలియా కంటే తక్కువ మ్యాచ్‌ల్లోనే టీమిండియా ఛేజింగ్‌ రికార్డును చేజిక్కించుకోవడం మరో విశేషం. కాగా ఇప్పటికే భారత ఆటగాళ్లు ప్రపంచ రికార్డులను కొల్లగొడుతూనే ఉన్నారు.