విరాట్ కోహ్లీ..ఎల్ కే జీ..! - MicTv.in - Telugu News
mictv telugu

విరాట్ కోహ్లీ..ఎల్ కే జీ..!

June 21, 2017

బ్యాటింగ్ లో కోహ్లీ తోపు కావొచ్చు… కెప్టెన్సీలో మాత్రం పిల్లాడే. ఆవేశం వచ్చినా..ఆనందం వచ్చినా ఊగిపోయే కుర్రకుంక. కెప్టెన్సీలో నాట్ మెచ్యూర్డ్. పిల్లలకు పదే పదే నచ్చనిది చెప్పితే అస్సలు ఒప్పుకోరు. వీడేంటీ మాకు చెప్పేది…చాదస్తంతో చంపేస్తున్నాడు అని అనుకుంటారు. అచ్చం కోహ్లీ సిచ్యూయేషన్ సేమ్ టు సేమ్. కోచ్ అంటే అలాగే ఉంటాడు అని తెలుసుకోలేకపోయాడు. బౌలింగ్ శిఖరం కోచ్ కుంబ్లేని కాదన్నాడు. కెప్లెన్సీలో ఓనమాలు నేర్చుతున్న కోహ్లీ నమ్మి బీసీసీఐ తప్పుచేసిందా..?ఇండియ‌న్ క్రికెట్‌ను ఎవ‌రూ బాగు చేయ‌లేరా…?

అనిల్ కుంబ్లే గురించి ఒక్కమాటలో చెప్పుకుంటే బౌలింగ్ లో ఎవరెస్టు. లెజెండ‌రీ ప్లేయ‌ర్‌గా దశాబ్ధం కాలం పాటు సూపర్ ఫెర్మామెన్స్.అతన్ని కమిట్ మెంట్ ముందు కోహ్లీగిహ్లీ జాన్తా నై. అలంటోడు కోచ్ అయితే ప్లేయర్స్ తో స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఉండాలి కూడా. తాను ఎలా ఆడాడో…వీళ్లను అలాగే చూడాలనుకున్నాడు. కానీ ఇది వీరుడులా ఫీలయ్యే విరాట్ కు నచ్చలేదు. ఏవైతే విన‌కూడ‌ద‌ని అనుకున్నాడో.. కుంబ్లే అవే చెప్పడం అగ్నికి ఆజ్యం పోసింది. క‌ఠినంగా ఉంటున్నాడ‌న్న ఒకే ఒక్క కార‌ణం చూపి అవమానకరరీతిలో కుంబ్లే కు పంపించడం టీమిండియాకే కోలుకోలేని దెబ్బ.

కోచ్ ఎలా ఉండాలో, ఎవ‌రుండాలో చెప్పే అధికారం కెప్టెన్‌కు ఎవ‌రిచ్చారు..?. విరాట్ గొప్ప బ్యాట్స్ మెన్ ఇందులో నో డౌట్. కెప్టెన్సీలో మాత్రం ఎల్ కేజీయే..అలాంటి ఇతని మాటలు నమ్మి బీసీసీఐ తప్పులో కాలేసింది.మొన్నమొన్ననే కెప్టెన్ అయిన కోహ్లీకి నచ్చచెప్పడంలో అడ్వైజరీ కమిటీ సైతం విఫలమైంది. కుంబ్లే లాంటి కోచ్ ను వదులుకోవడం టీమిండిమాకే మైనస్.

కోహ్లీ తీరుపై క్రికెట్ అభిమానులు గుస్సా అవుతున్నారు. గ్రెగ్ చాఫెల్ లాంటోడే వీళ్లకు కరెక్ట్ మొగుడంటున్నారు. ఒలింపిక్ గోల్డ్ మెడ‌లిస్ట్‌, షూట‌ర్ అభిన‌వ్ బింద్రా కోహ్లికి ప‌రోక్షంగా చుర‌క‌లంటించాడు. విరాట్‌తో ప‌డ‌క కుంబ్లే రాజీనామా చేయ‌డంపై అత‌ను స్పందించాడు. కోచ్‌తో త‌న అనుభ‌వాన్ని ట్విట్ట‌ర్‌లో షేర్ చేసుకున్నాడు. “నా కెరీర్‌లో మంచి గురువు అంటే కోచ్ ఉవె. అత‌న్ని నేను ద్వేషించేవాడిని. కానీ 20 ఏళ్లుగా అత‌నితోనే ఉన్నా “అని బింద్రా ట్వీట్ చేశాడు. బింద్రా అర్థం చేసుకున్నట్టుగా కూడా స్టార్ ప్లేయర్లు కోచ్ ని అర్థం చేసుకోకపోవడం విస్మయం కలిగిస్తుంది. కోహ్లీ తీరు ఇలాగే ఉంటే టీమిండియా ను బాగు చేయడం ఎవరి వల్ల కాదు..