ఆ నవ్వులేంట్రా బాబు... - Telugu News - Mic tv
mictv telugu

ఆ నవ్వులేంట్రా బాబు…

June 19, 2017


టీమిండియా కాదు జోక్ ఇండియా..పాకిస్థాన్ దాయాది కాదు..దోస్త్ మేరా దోస్త్. గేమ్ స్పిరిట్ ..స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే ఇదేనేమో. ఈద్ ముబారక్ అంటూ రంజాన్ కానుకగా చాంపియన్స్ ట్రోపీ సమర్పించేశారు విరాట్ ది గ్రేట్.. బట్ అర్థం పర్థం లేని ఆ నవ్వులేంట్రా బాబు…అసలే ఫ్యాన్స్ ఫైర్ అవుతుంటే కోహ్లీ సేన ఎందుకిలా బిహేవ్ చేసింది..?ఓడిపోయామన్న బాధ వాళ్లల్లో ఎక్కడా కనిపించలేదు..ఎందుకిలా…?

బ్యాటింగే ప్రధాన బలమున్న టీమ్‌ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎందుకు ఎంచుకుంది ? ఫ్లాట్ వికెట్ పై బంతి తిరగదు అని తెలిసి కూడా ఇద్దరు స్పిన్నర్లతో భారత్ ఎందుకు ఆడింది.. ? అశ్విన్‌ స్థానంలో ఉమేష్ యాదవ్‌ను ఎందుకు బరిలోకి దించలేదు ? ఇవన్నీ భారత అభిమానులను తొలుస్తున్న ప్రశ్నలు. 2003 ప్రపంచకప్ ఫైనల్లోనూ అప్పటి కెప్టెన్ గంగూలీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆ పొరపాటుకు ఎప్పటికీ చింతిస్తూనే ఉంటారు.ఆనాటి టాస్ గాయంపై మరోసారి విరాట్ కోహ్లి కారం చల్లాడు. లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ తొలుత బ్యాటింగ్ చేసి గెలిచింది. అదే తరహాలో ఈ మ్యాచ్‌ కూడా గెలవొచ్చు అని ఎందుకు భావించలేదు. కింగ్ ఆఫ్ ఛేజింగ్ అని పేరున్న విరాట్ కోహ్లి ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను తక్కువ అంచనా వేసి తలకిందులయ్యాడు. ఇది వోకే.. ఆటలో గెలుపు ఓటమి సహజం. భారత్ ఓటమితో టీవీల ముందు కూర్చున్న అభిమానుల ముఖాలు మాడిపోయాయి. టీమిండియా క్రికెటర్లలో మాత్రం నవ్వులు కనిపించాయి. క్రీడాస్ఫూర్తి మరి ఎక్కువైనట్టుంది. కోహ్లీకి మాత్రం చెప్పలేనంతగా..ఇదోదో పాకిస్థాన్ కు రంజాన్ కానుక ఇచ్చారు అనుకుందాం..అందుకు ఇంతలా ఎంజాయ్ చేయాలా..అసలే ఫ్యాన్స్ కు కాలుతుంటే…