విరాట్ విశ్వరూపం..సచిన్ రికార్డ్ క్రాస్..! - MicTv.in - Telugu News
mictv telugu

విరాట్ విశ్వరూపం..సచిన్ రికార్డ్ క్రాస్..!

July 7, 2017

వెస్టిండీస్‌పై ఐదు వన్డేల సిరీస్‌ను 3-1తేడాతో దక్కించుకున్న టీమిండియా సంబరాల్లో ముగినిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 111 పరుగులతో దుమ్మురేపాడు.28 సెంచరీతో కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. అంతేకాదు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ రికార్డును క్రాస్ చేశాడు. వన్డేల్లో ఇప్పటి వరకు మొత్తం 28 సెంచరీలు కొట్టిన కోహ్లీ 18 శతకాలను ఛేజింగ్ లో సాధించడం హైలైట్ . గతంలో ఛేదనలో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా సచిన్‌ అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు కోహ్లీ ఆ స్థానానికి చేరాడు. సచిన్‌ తన కెరీర్లో 17 శతకాలను 232 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా… కోహ్లీ కేవలం 102 ఇన్నింగ్స్‌ల్లోనే 18 సెంచరీలు చేశాడు. నమోదు చేశాడు.