ఏమిటా ప్రశ్న..మిథాలీ నువ్వు సూపర్... - MicTv.in - Telugu News
mictv telugu

ఏమిటా ప్రశ్న..మిథాలీ నువ్వు సూపర్…

June 23, 2017

కొందరు విలేకర్లకు తిక్క ఉంటుంది. ఆ తిక్కకు లెక్క ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు లెక్క తప్పుతుంది. ఇరిక్కించబోయి ఇరుక్కుంటారు. ఇలాగే తిక్క ప్రశ్నలేసిన పాక్ విలేకరి కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్. లండన్ లో పాకిస్థాన్‌ విలేకరి మిథాలీని ప్రశ్నించబోయి షాక్ తిన్నారు. భారత్, పాక్ జట్లలో మీ అభిమాన క్రికెట్ ఆటగాడు ఎవరు? అని ప్రశ్నించాడు.

అతడి ప్రశ్నపై మిథాలీ ఒక్కసారిగా ఫైర్ అయింది. ‘‘ఏమిటా ప్రశ్నా,ఎవరైనా ఆటగాడిని మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరు అని మీరు అడగగలరా? అని విరుచుకుపడింది. ‘ఎవరైనా ప్రశ్న అడిగేటప్పుడు మీ అభిమాన క్రికెటర్ ఎవరు? అని అడుగుతారే తప్ప, మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరు? అని అడుగుతారా? ఎక్కడైనా? అని ప్రశ్నించడంతో పాక్ విలేకరి అవాక్కయ్యాడు.