టీమ్ ని నడిపించే సూరీడు ఈ ట్రేసర్‌బుల్లెట్..! - MicTv.in - Telugu News
mictv telugu

టీమ్ ని నడిపించే సూరీడు ఈ ట్రేసర్‌బుల్లెట్..!

July 13, 2017

టీమిండియా ఇక దుమ్మురేపుతోందా..? ఫ్రెండ్లీ కోచ్ రవిశాస్త్రి రాకతో సారథి కోహ్లీ రెచ్చిపోయి ఆడుతాడా…?కుంబ్లేని మించి ఈ ట్రేసర్ బుల్లెట్ భారత జట్టుని నడిపిస్తాడా…? అవుననే అంటున్నారు టీమిండియా ప్లేయర్లు…

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి నియామకంతో టీమిండియా ప్లేయర్లు తెగ ఖుషీ అవుతున్నారు. భారత క్రికెట్‌కు మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రవిశాస్త్రి నేతృత్వంలో భారత్‌ అద్భుతంగా రాణించాలని కోరుకున్నారు. రైనా ట్విటర్‌లో కోచ్‌లుగా నియమితులైన రవిశాస్త్రి, జహీర్‌ఖాన్‌, రాహుల్‌ద్రవిడ్‌లకు శుభాకాంక్షలు తెలిపాడు.

అనిల్‌కుంబ్లేకు మద్దతుగా.. అప్పుడు జహీర్‌, ద్రవిడ్‌ అవసరం రాలేదుకానీ.. ఇప్పుడు రవిశాస్త్రికి మాత్రం ఎందుకో అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. భారత్‌ క్రికెట్‌కు తాజా నిర్ణయం మేలు చేస్తుందని.. విదేశాల్లో భారత్‌ మరింత మెరుగ్గా రాణిస్తుందని మరికొందరు అంటున్నారు. మొత్తానికి భారత్‌ క్రికెట్‌లో ‘ట్రేసర్‌బుల్లెట్‌’గా పేరుగాంచిన రవిశాస్త్రికి గ్రాండ్ వెల్ కం అంటూ మరికొందరు ట్వీట్లు చేశారు.